TG TET Syllabus – Paper I
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TEACHER ELIGIBILITY TEST)
TGTET-June-2026
Dear TG TET 2026 Aspirants...
మీ ప్రిపరేషన్ మరింత సులభతరం చేయడానికి, విద్యాశాఖ వారు అధికారికంగా ఇంగ్లీష్ లో మాత్రమే విడుదల చేసిన సిలబస్ ను 'మన Test Series' బృందం తెలుగు మీడియంలోకి అనువదించి ఇక్కడ అందిస్తోంది (ఇంగ్లీష్ సబ్జెక్ట్ మినహా). ఈ సిలబస్ ను స్పష్టంగా అర్థం చేసుకుని, పక్కా ప్రణాళికతో చదివి మీరు రాబోయే టెట్ పరీక్షలో ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము! All the best! 🎯
Exam Pattern overview
TG TET Paper 1 పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలన్నీ మల్టిపుల్ ఛాయిస్ (MCQs) రూపంలో ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ లేదు. పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు.
PART I శిశు వికాసం మరియు బోధనా పద్ధతులు
CHILD DEVELOPMENT AND PEDAGOGY • 30 Marks
శిశు వికాసం మరియు బోధనా పద్ధతులు
CHILD DEVELOPMENT AND PEDAGOGY • 30 Marks
1. శిశు వికాసం (DEVELOPMENT OF CHILD)
- వికాసం, పెరుగుదల & పరిణతి - భావన & స్వభావం.
- వికాస సూత్రాలు & వాటి విద్యాపరమైన ప్రాముఖ్యత.
- వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు - జీవ, మానసిక, సామాజిక అంశాలు.
- వికాస పరిమాణాలు మరియు వాటి అంతర్గత సంబంధాలు: శారీరక & చలనాత్మక, సంజ్ఞానాత్మక, ఉద్వేగ, సామాజిక, నైతిక, భాషా వికాసం (శైశవ, పూర్వ బాల్య, ఉత్తర బాల్య, కౌమార దశలకు సంబంధించి).
- వికాసాన్ని అర్థం చేసుకోవడం - పియాజె, కోల్బర్గ్, చోమ్స్కీ, కార్ల్ రోజర్స్ మరియు ఎరిక్సన్.
- వైయుక్తిక భేదాలు - వైఖరులు, సహజ సామర్థ్యం, ఆసక్తి, అలవాట్లు, ఆలోచన (విభిన్న & కేంద్రీకృత), ప్రజ్ఞ మరియు వాటి మాపనంలో అంతర & అంతర్గత వైయుక్తిక భేదాలు.
- మూర్తిమత్వ వికాసం - భావన, మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు, పిల్లల పెంపక పద్ధతులు, స్వీయ-భావన.
- సర్దుబాటు, ప్రవర్తనా సమస్యలు, రక్షణ తంత్రాలు, మానసిక ఆరోగ్యం.
- శిశు వికాస అధ్యయన పద్ధతులు మరియు ఉపగమాలు - అంతఃపరిశీలన, పరిశీలన, ఇంటర్వ్యూ, వ్యక్తి అధ్యయన పద్ధతి (Case study), ప్రయోగాత్మక, నిర్ధారణా మాపనులు, సంఘటన రచనాత్మక రికార్డులు, ప్రశ్నావళి, క్రాస్ సెక్షనల్ మరియు లాంగిట్యూడినల్ పద్ధతులు.
- వికాస కృత్యాలు మరియు ఆటంకాలు.
2. అభ్యసనాన్ని అర్థం చేసుకోవడం (UNDERSTANDING LEARNING)
- అభ్యసన భావన, స్వభావం - ఇన్పుట్ - ప్రాసెస్ - అవుట్కమ్.
- అభ్యసనాన్ని ప్రభావితం చేసే అంశాలు - వ్యక్తిగత మరియు పర్యావరణ.
- అభ్యసన ఉపగమాలు మరియు వాటి అనువర్తనం - ప్రవర్తనావాదం (స్కిన్నర్, పావ్లోవ్, థార్న్ డైక్), నిర్మాణాత్మకవాదం (పియాజె, వైగోట్స్కీ), గెస్టాల్ట్ వాదం (కోహ్లర్, కోఫ్కా) మరియు పరిశీలనాత్మక అభ్యసనం (బండూరా).
- అభ్యసన పరిమాణాలు - సంజ్ఞానాత్మక, భావావేశ మరియు పనితీరు (Performance).
- ప్రేరణ మరియు నిలుపుదల (Sustenance) - అభ్యసనంలో దాని పాత్ర.
- స్మృతి & విస్మృతి.
- అభ్యసన బదలాయింపు.
3. బోధనాపరమైన అంశాలు (PEDAGOGICAL CONCERNS)
- బోధన మరియు దానికి అభ్యసనంతో, అభ్యాసకుడితో ఉన్న సంబంధం.
- విభిన్న సందర్భాలలో అభ్యాసకులు: సామాజిక-రాజకీయ మరియు సాంస్కృతిక సందర్భంలో అభ్యాసకుడి స్థానం.
- విభిన్న నేపథ్యాల పిల్లలు - ప్రత్యేక అవసరాలు గల పిల్లలు (CWSN), సమ్మిళిత విద్య (Inclusive Education).
- బోధనా పద్ధతులను అర్థం చేసుకోవడం.
- విచారణ ఆధారిత అభ్యసనం, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనం, సర్వే, పరిశీలన మరియు కృత్యాధార అభ్యసనం, సహకార (Co-operative & Collaborative) అభ్యసనం.
- వ్యక్తిగత మరియు సమూహ అభ్యసనం: తరగతి గదిలో అభ్యసన నిర్వహణకు సంబంధించిన సమస్యలు - అనగా అధ్యయన అలవాట్లు, స్వీయ అభ్యసనం మరియు నేర్చుకోవడాన్ని నేర్చుకునే నైపుణ్యాలు.
- విజాతీయ తరగతి గది సమూహాలలో అభ్యసన నిర్వహణ - సామాజిక-ఆర్థిక నేపథ్యం, సామర్థ్యాలు మరియు ఆసక్తులు.
- అభ్యసన నిర్వహణ నమూనాలు - ఉపాధ్యాయ కేంద్రీకృత, విషయాధారిత మరియు విద్యార్థి కేంద్రీకృత.
- బోధనా సిద్ధాంతం - బ్రూనర్.
- ఒక ప్రణాళికాబద్ధమైన కృత్యంగా బోధన - ప్రణాళికా అంశాలు.
- బోధనా దశలు - ప్రీ-యాక్టివ్, ఇంటరాక్టివ్ మరియు పోస్ట్-యాక్టివ్.
- బోధనకు అవసరమైన సాధారణ మరియు సబ్జెక్టు సంబంధిత నైపుణ్యాలు, సామర్థ్యాలు మరియు ఉత్తమ ఫెసిలిటేటర్ (సౌకర్యకర్త) లక్షణాలు.
- అభ్యసన వనరులు - స్వీయ, ఇల్లు, పాఠశాల, ఆట, సమాజం, సాంకేతికత.
- తరగతి గది నిర్వహణ: విద్యార్థి పాత్ర, ఉపాధ్యాయుని పాత్ర, ఉపాధ్యాయుని నాయకత్వ శైలి, బెదిరింపు లేని అభ్యసన వాతావరణ సృష్టి, ప్రవర్తనా సమస్యల నిర్వహణ, మార్గదర్శకత్వం & కౌన్సెలింగ్, బాలల అకృత్యాలు (Child Abuse), శిక్ష మరియు దాని చట్టపరమైన చిక్కులు, బాలల హక్కులు, సమయ నిర్వహణ.
- అభ్యసనం కొరకు మదింపు & అభ్యసన మదింపుల మధ్య వ్యత్యాసం, పాఠశాల ఆధారిత మదింపు, నిరంతర & సమగ్ర మూల్యాంకనం (CCE): దృక్పథం & ఆచరణ.
- NCF, 2005 & విద్యా హక్కు చట్టం (RTE), 2009 నేపథ్యంలో బోధన & అభ్యసనను అర్థం చేసుకోవడం.
PART II భాష-1 - తెలుగు
LANGUAGE-1 - TELUGU • 30 Marks
భాష-1 - తెలుగు
LANGUAGE-1 - TELUGU • 30 Marks
ఎ) విషయం (Content - 24 Marks)
- పఠనావగాహన (పద్యం, గద్యం).
- తెలంగాణ సాహిత్యం, సంస్కృతి (ప్రాచీనం, ఆధునికం) (2015లో రూపొందించిన పాఠ్య పుస్తకాల ఆధారంగా).
- తెలంగాణ కవులు, రచయితలు, నూతన పాఠ్య పుస్తకాలలోని ఇతర తెలుగు కవులు, రచయితలు
- ప్రక్రియలు
- శతకాలు
- కళలు, కళాకారులు
- వేడుకలు
- క్రీడలు/పాటలు
- పదజాలం: సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు, తెలంగాణ పదజాలం, అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్యర్థాలు, ప్రకృతి ప్రకృతులు.
- భాషాంశాలు: ద్విత్వ, సంయుక్త, సంశ్లేష అక్షరాలు, వాక్యాలు, వర్గ యుక్కులు, పరుషాలు, సరళాలు, భాషా భాగాలు, లింగాలు, వచనాలు, కాలాలు, విభక్తులు, అవ్యయాలు, విరామ చిహ్నాలు, తెలుగు సంస్కృత సంధులు, సమాసాలు, క్రియలు (సమాపక, అసమాపక), వాక్యాలు రకాలు - ఆశ్చర్యార్థక, విధ్యర్థక, ప్రశ్నార్థక, సందేహార్థక, అనుమత్యర్థక, నిషేధార్థక, ప్రత్యక్ష పరోక్ష, కర్తరి - కర్మణి - ఛందస్సు, అలంకారాలు, అర్థవిపరిణామం.
బి) బోధనా పద్ధతులు (Pedagogy - 6 Marks)
- భాష, మాతృభాష, మాతృభాష బోధన లక్ష్యాలు.
- భాష – వివిధ భావనలు, స్వభావం, తరగతి గది అన్వయం.
- భాషా నైపుణ్యాలు/సాధించాల్సిన సామర్థ్యాలు, తరగతి గది అన్వయం.
- బోధనా పద్ధతులు.
- ప్రణాళిక రచన, వనరుల వినియోగం, సహ పాఠ్య కార్యక్రమం.
- బోధనాభ్యసన ఉపకరణాలు.
- నిరంతర సమగ్ర మూల్యాంకనం- నిర్మాణాత్మక మూల్యాంకనం-సంగ్రహణాత్మక మూల్యాంకనం.
PART III LANGUAGE - II (ENGLISH)
ENGLISH LANGUAGE • 30 Marks
LANGUAGE - II (ENGLISH)
ENGLISH LANGUAGE • 30 Marks
CONTENT (Marks: 24)
- Parts of Speech
- Tenses
- Types of Sentences
- Prepositions & Articles
- Degrees of Comparison
- Direct and Indirect Speech
- Questions and question tags
- Active & Passive voice
- Phrasal verbs
- Reading Comprehension
- Composition
- Vocabulary
- Meaning of idiomatic expressions
- Correction of Sentences
- Sequencing of the Sentences in the given paragraph
- Error identification within a sentence
PEDAGOGY (Marks: 06)
- Aspects of English: (a) English language - History, nature, importance, principles of English as second language (b) Problems of teaching / learning English.
- Objectives of teaching English.
- Phonetics.
- Development of Language skills: (a) Listening, Speaking, Reading & Writing (LSRW). (b) Communicative skills.
- Approaches, Methods, Techniques of teaching English: (a) Introduction, Definition and Types of approaches methods and techniques of teaching English (b) Remedial teaching.
- Teaching of structures and vocabulary items.
- Teaching learning materials in English.
- Lesson Planning.
- Curriculum & Textbooks.
- Evaluation in English language Teaching - CCE.
PART IV గణితం
MATHEMATICS • 30 Marks
గణితం
MATHEMATICS • 30 Marks
కంటెంట్ (CONTENT) (మార్కులు: 24)
- సంఖ్యా వ్యవస్థ (Number System): సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు & వాటి ప్రాథమిక పరికర్మలు. ప్రధాన, సంయుక్త సంఖ్యలు. క.సా.గు, గ.సా.భా. భారతీయ కరెన్సీ. సంఖ్యలను సంఖ్యారేఖపై సూచించడం. కొలతలు, దశాంశాలు (అంతమయ్యే, అంతంకాని). సంఖ్యల వర్గం, వర్గమూలం, ఘనం, ఘనమూలాలు. పైథాగరియన్ త్రికాలు.
- భిన్నాలు (Fractions): క్రమ, అపక్రమ, మిశ్రమ, దశాంశ భిన్నాలు, భిన్నాల పోలిక, పరికర్మలు, చిత్ర ప్రాతినిధ్యం, నిత్యజీవితంలో ఉపయోగాలు.
- అంకగణితం (Arithmetic): ఏక వస్తు మార్గం, శాతాలు, లాభనష్టాలు, నిష్పత్తి అనుపాతం, బారు వడ్డీ, చక్ర వడ్డీ, కాలం-పని, కాలం-దూరం, పన్ను (VAT).
- జ్యామితి (Geometry): 2D & 3D ఆకారాలు, కోణాలు, రేఖలు, త్రిభుజాలు, చతుర్భుజాలు, సర్వసమానత్వం, ఆయిలర్ సంబంధం, వృత్తాలు, సౌష్టవం.
- కొలతలు (Measurements): పొడవు, బరువు, పరిమాణం (Capacity), కాలం కొలతలు. సమఘనం, దీర్ఘఘనం ఉపరితల వైశాల్యం, ఘనపరిమాణం. వృత్త పరిధి, వైశాల్యం ఇత్యాదివి.
- దత్తాంశ అనువర్తనాలు (Data Applications): దత్తాంశ ప్రాతినిధ్యం, పౌనఃపున్య విభాజన పట్టిక, బార్ గ్రాఫ్, పిక్టోగ్రాఫ్, హిస్టోగ్రామ్, సగటు, మధ్యగతం, బాహుళకం.
- బీజగణితం (Algebra): సామాన్య సమీకరణాలు, రేఖీయ సమీకరణాలు, ఘాతాలు - ఘాతాంకాలు, బీజీయ సమాసాలు, బీజీయ పరికర్మలు, బీజీయ సర్వసమీకరణాలు (algebraic identities).
బోధనా పద్ధతులు (PEDAGOGY) (మార్కులు: 06)
- గణితం యొక్క నిర్వచనాలు మరియు స్వభావం.
- గణిత బోధనా ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు మరియు విద్యా ప్రమాణాలు.
- గణిత బోధనా పద్ధతులు.
- గణితంలో బోధనా సామాగ్రి - గణితంలో TLM.
- బోధనా ప్రణాళిక (Instructional Planning).
- నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE) - నిర్మాణాత్మక మదింపు, సంగ్రహణాత్మక మదింపు ప్రక్రియలు.
- విద్యా సాధనా పరీక్షల (SAT) రూపకల్పన, నిర్వహణ, విశ్లేషణ.
- లోపనిర్ధారణ మరియు నివారణ బోధన (Remedial Teaching).
- గణిత ఉపాధ్యాయుడు & వనరుల వినియోగం. విద్యా ప్రణాళిక (కరికులం) మరియు పాఠ్యపుస్తకం.
PART V పరిసరాల విజ్ఞానం
ENVIRONMENTAL STUDIES • 30 Marks
పరిసరాల విజ్ఞానం
ENVIRONMENTAL STUDIES • 30 Marks
కంటెంట్ (CONTENT) (మార్కులు: 24)
- నా కుటుంబం, పని & ఆటలు: కుటుంబ వృక్షం, వలసలు, ఉమ్మడి కుటుంబాలు. వృత్తులు, బాల కార్మికులు, ఆటలు, జాతరలు/సంతలు, సర్కస్.
- మొక్కలు మరియు జంతువులు: మన చుట్టూ ఉన్న మొక్కలు & జంతువులు, కిరణజన్య సంయోగక్రియ, పువ్వు, పండ్లు. అడవి & పెంచే మొక్కలు, అడవి & పెంపుడు జంతువులు.
- మన ఆహారం, ఆవాసం: ఆహారం నిల్వ, పశుసంవర్ధన, పోషకాలు, లోప వ్యాధులు. వివిధ రకాల ఇళ్ళు, జంతువుల ఆవాసాలు.
- గాలి & శక్తి: వాతావరణ పీడనం, గాలి కాలుష్యం, గ్రీన్ హౌస్ ప్రభావం. పునరుత్పాదక & పునరుత్పాదకం కాని శక్తి వనరులు.
- నీరు: నీటి వనరులు, జలచర వృక్ష జంతుజాలం. జల కాలుష్యం, శుద్ధి, కరువులు, వరదలు.
- మన శరీరం: ఆరోగ్యం, పరిశుభ్రత, ఎముకలు, కండరాలు, జ్ఞానేంద్రియాలు. జీర్ణ, శ్వాస, నాడీ, రక్త ప్రసరణ వ్యవస్థలు. ప్రథమ చికిత్స.
- మ్యాపింగ్, భారతదేశ చరిత్ర: దిక్కులు, మండలం, జిల్లా, రాష్ట్రం. చరిత్ర పూర్వ యుగం, మత ఉద్యమాలు, జాతీయోద్యమం, ఆధునిక భారతదేశం.
- మన దేశం - భారతదేశం / మన రాష్ట్రం - తెలంగాణ: పౌగోళిక స్వరూపాలు, ఖండాలు, తెలంగాణ సంస్కృతి, రాష్ట్ర ప్రభుత్వం, పంచాయితీలు, మున్సిపాలిటీలు.
- భారత రాజ్యాంగం, భద్రత: పీఠిక, ప్రాథమిక హక్కులు & విధులు, బాలల హక్కులు. భూకంపాలు, వరదలు, 108 & 104 సేవలు.
బోధనా పద్ధతులు (PEDAGOGY) (మార్కులు: 06)
- పరిసరాల విజ్ఞానం (సైన్స్ & సోషల్ స్టడీస్) భావన మరియు పరిధి.
- పరిసరాల విజ్ఞానం బోధనా ఉద్దేశాలు & లక్ష్యాలు, EVS బోధన యొక్క విద్యా ప్రమాణాలు.
- సైన్స్ మరియు సోషల్ స్టడీస్ తో సంబంధం.
- విద్యా ప్రణాళిక (కరికులం) మరియు దాని నిర్వహణ.
- అభ్యసన వాతావరణం.
- నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE).
Master this Syllabus
Take a mock test based on the above TG SCERT syllabus.